లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- December 23, 2025
కువైట్: కువైట్ మునిసిపల్ కౌన్సిల్ ప్రకటనల నిబంధనలకు ప్రధాన సవరణలను ఆమోదించింది. ఈ రంగాన్ని నియంత్రించడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి అధిక జరిమానాలను ప్రవేశపెట్టింది. ఈ సవరణలు ప్రతికూల ప్రకటనల కంటెంట్‌ను నిరోధిస్తుందని కౌన్సిల్ ఆర్థిక కమిటీ అధిపతి ఫహద్ అల్-అబ్దుల్జాదర్ తెలిపారు.
కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య మరియు పారిశ్రామిక సంస్థలు తమ ప్రాంగణం ముందు భాగంలో స్పష్టమైన గుర్తింపు చిహ్నాలను పెట్టాలి. అధికారిక అనుమతి లేకుండా పొగాకు, సిగరెట్లు, మందులు మరియు వైద్య విధానాల ప్రకటనలతో సహా నిషేధిత ప్రకటనలను, అలాగే హానికరంగా భావించే ఏదైనా కంటెంట్ ప్రకటనలను ప్రదర్శించకూడదు. ఉల్లంఘనను బట్టి KD 100 నుండి KD 5,000 వరకు జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. వీటితోపాటు డెలివరీ మోటార్‌సైకిళ్లపై ప్రకటనలకు KD 40 వార్షిక రుసుమును, వాణిజ్య ప్రకటనలకు KD 100 వార్షిక రుసుములను కూడా కౌన్సిల్ ఆమోదించింది.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







