సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!

- December 23, 2025 , by Maagulf
సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!

రియాద్: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) బ్యాంకింగ్ మరియు చెల్లింపు సేవల రుసుములపై తగ్గింపులు, పరిమితులను ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సంస్థల సేవల కోసం కొత్త రుసుము గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కొత్త మార్గదర్శి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుత బ్యాంకింగ్ ఫీజుల తగ్గింపు అన్ని ఆర్థిక సంస్థలకు వర్తిస్తుంది. అప్డేట్ రుసుములు ప్రచురణ తేదీ నుండి 60 రోజుల్లోపు అమలులోకి వస్తాయని ప్రకటించారు.  

కన్స్యూమర్ ఫైనాన్స్ మరియు మోటార్ ఫైనాన్స్ లీజింగ్‌తో సహా రియల్ ఎస్టేట్ కాని ఫైనాన్స్ ఉత్పత్తులకు గరిష్ట పరిపాలనా రుసుములు తగ్గించారు. గతంలో ఫైనాన్స్ మొత్తంలో 1% లేదా SR5000, ఏది తక్కువైతే అది ఉండగా,  కొత్తగా 0.5% లేదా SR2,500, ఏది తక్కువైతే అది విధించనున్నారు.  మడా కార్డుల పునః జారీకి SR30 నుండి SR10కి తగ్గించారు.  అంతర్జాతీయ లావాదేవీ రుసుములను లావాదేవీ మొత్తంలో 2%కి పరిమితం చేశారు.  ఇక  మడా కార్డులను ఉపయోగించి అంతర్జాతీయ నగదు ఉపసంహరణలకు సంబంధించి లావాదేవీ విలువలో 3%కి పరిమితం చేయగా, గరిష్టంగా SR25కి పరిమితం చేశారు. బ్యాంక్ చెక్కు జారీ ఫీజులను SR10 నుండి SR5 కు తగ్గించారు.     

బ్యాంక్ ఖాతాలు మరియు ఎలక్ట్రానిక్ వాలెట్ల ద్వారా రాజ్యంలో ఎలక్ట్రానిక్ బదిలీల కోసం రుసుములకు సంబంధించి  SR2500 వరకు బదిలీలకు SR0.5 గా నిర్ణయించారు. SR2500 కంటే ఎక్కువ మరియు SR20,000 వరకు బదిలీలకు SR1 కి పరిమితం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com