శంబాల సినిమా గురించి ఆది ఏమన్నాడంటే..
- December 24, 2025
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ సినిమా డిసెంబర్ 25 రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆది మీడియాతో మాట్లాడుతూ శంబాల సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
శంబాల గురించి మాట్లాడుతూ.. శంబాల సినిమా బాగా వచ్చింది. మా మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు. శంబాల ఉందా? లేదా అనేది ఎవ్వరికీ తెలీదు కానీ మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. శంబాల అని టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను కానీ ఈ కథ విన్న కొన్ని రోజులకే కల్కి రిలీజ్ అయింది. ఆ తరువాత శంబాల పేరు మరింత వైరల్ అవ్వడంతో మా సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా మొదటి స్టిల్ వదిలినప్పటి నుంచి సినిమాపై బజ్ ఉంది. ఈసారి మంచి హిట్ కొడతాను అని నమ్మకం ఉంది అన్నారు.
శంబాల సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, ఎదురైన సవాళ్ల గురించి చెప్తూ.. శంబాల సినిమాలో అద్భుతమైన పోరాట సన్నివేశాలున్నాయి. రాజ్ కుమార్ మాస్టర్ అన్ని యాక్షన్ సీక్వెన్స్‌కి రిహార్సల్స్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. షూటింగ్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సందర్భంలో గాయాలు అవుతుంటాయి. ఫైర్‌తో ఓ సీక్వెన్స్ చేసినప్పుడు చిన్న గాయాలు అయ్యాయి. పోరాట సన్నివేశాల్లో గాయాలు అనేవి కామన్. ఈ సినిమాను విపరీతమైన చలిలో నైట్ షూట్ చేశాం. క్లైమాక్స్ పార్ట్ మొత్తం నైట్ షూట్లోనే జరిగింది అని తెలిపారు.
అలాగే.. శంబాల సినిమాలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండవు. ఉన్న వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. అంత అద్భుతంగా ఇచ్చారు. ఈ సినిమా నిర్మాతలు నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు అని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







