కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- December 25, 2025
బెంగళూరు: కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున.. లారీ ఒకటి..ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.. సదరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా.. చిత్రదుర్గ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును ఢీకొట్టిన లారీ కూడా మంటల్లో దగ్ధమైంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!







