'మారెమ్మ' షూటింగ్ పూర్తి

- December 26, 2025 , by Maagulf
\'మారెమ్మ\' షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్,  గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో మాధవ్ ఎద్దును నడిపిస్తూ ధైర్యంగా ముందుకు వస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో శక్తివంతంగా కనిపించే కాళీదేవి విగ్రహం, చుట్టూ గ్రామీణ పండుగ వాతావరణం, జనసందడి, ఉత్సవ ఉత్సాహంతో పాటు ఒక పవర్ ఫుల్ సంఘటనకు సంకేతంగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి,  వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి కందాలా
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx ప్రొడ్యూసర్: చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com