మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!

- December 27, 2025 , by Maagulf
మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!

మనామా: బుసైతీన్‌లోని షేక్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిని రోడ్ 105తో కలిపే కొత్త లింక్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్త సంవత్సరం మొదటిరోజు బ్రిడ్జిని అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. 

ఇది మనమా మరియు ముహారక్ మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడంతోపాటు బుసైతీన్, సయా, డైర్, సమాహీజ్ మధ్య ట్రాఫిక్ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ప్రతి దిశలో రెండు లేన్లు ఉంటాయి. ఇది షేక్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జి మరియు రోడ్ 105 మధ్య ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది రోజువారీ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని, షేక్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జి-అల్ ఘూస్ రోడ్ జంక్షన్‌పై ఒత్తిడిని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.

బ్రిడ్జి ప్రారంభం అయ్యాక మనామా నుండి దియార్ అల్ ముహర్రక్‌కు రద్దీ సమయాల్లో 20 నిమిషాల వరకు ప్రయాణ సమయం తగ్గుతుందని భావిస్తున్నారు.  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, విద్యుత్ మరియు నీటి అథారిటీ , అనేక ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం కారణంగా ఈ ప్రాజెక్ట్ రికార్డు సమయంలో పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com