పనిమనిషి చేతిలో పసిపాప మృతి ఆరోపణలు
- July 27, 2016
షార్జ: ఒక ఇండోనేషియన్ పనిమనిషి తాను పనిచేస్తున్న చోట ఒక తొమ్మిది నెలల పాపను తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు బుధవారం రాగా, గాయపడిన ఆ చిన్నారి అల్ ఖ్అసిమి ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించారు.ఆ ఎమిరేట్ శిశువు సలమా అల్ మజ్మి ఆస్పత్రిలో చేరిన తర్వాత కోమాలో రెండు వారాల జీవనపోరాటం చేసింది. 28 ఏళ్ళ ఈ పనిమనిషి తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నేరం అంగీకరించింది. ఆ దాడిలో బిడ్డ విరిగిన పుర్రె సహా శరీరం యొక్క వివిధ భాగాలపై తీవ్ర గాయాలు ఏర్పడి అంతర్గత రక్తస్రావం ఏర్పడింది.శిశువు యొక్క తండ్రి, సేలం అల్ మజ్మి అబూ ధాబీ లో సైన్యంలో పని చేస్తారు. ఆయన భార్యకు తన చిన్నారి పసిపాప మరణించినట్లు వార్త తెలిసిన తర్వాత తీవ్రమైన మనోవేదనకు లోనయ్యాయంది.తమ కన్నా కూతురు చావుకి కారణమైన ఆ పనిమనిషికి కోర్టు ఎటువంటి తీర్పు విధిస్తుందో ఆవేదనగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంటున్నారు. అల్ ఖ్అసిమి హాస్పిటల్ లో నరాల సర్జన్ మరియు సలహాదారుడిగా వైద్య సేవలందిస్తున్న డాక్టర్ సతీష్ కృష్ణన్ మాట్లాడుతూ ఏడాది వయస్సు లేని ఆ పసిగుడ్డుని ఆస్పత్రిలో చేర్చారని ఆ చిన్నారి శిశువు చాలా దయనీయమైన ఉందని మెదడులో రక్తస్రావంని తగ్గించేందుకు ఒక సున్నితమైన మెదడు శస్త్రచికిత్సఅవసరమని గుర్తించినట్లు తెలిపారు. బేబీ సలమాని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు వెంటిలేటర్ మీద ఉంచామని అన్నారాయన.ఆ శిశువు తీవ్రమైన బ్రెయిన్ డేమేజ్ తో బాధపడింది అదేవిధంగా ఎంతో బలహీనమైన గుండె తో అత్యవసర గదికి చేర్చారు.అప్పటికే ఆ పసిపాప స్పృహ తప్పి, శ్వాస పీల్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడింది. ఆసుపత్రి లోని చిన్నారుల విభాగంలో చేరిన వెంటనే మరియు అవసరమైన వైద్య పరీక్షలు మరియు సి టి స్కాన్లు తీయడం జరిగింది. ఆ పసి మెదడులో రక్తం గడ్డ కట్టిన భాగాన్ని ఫలితాలలో చూపించిందని వైద్యులు తెలిపారు. అలాగే స్కాన్ లో పాప పుర్రె లో పగుళ్ళు కనబడ్డాయి అంతేకాక పక్కటెముకలు విరిగినట్లు చూపిన తెలిపింది. ఆ పసిపాప పుర్రె వాపుతో బాధపడినట్లు ఆయన తెలిపారు
శిశువు తల్లిదండ్రులు ఇండోనేషియా పనిమనిషిని సంఘటన తరువాత విచారించినట్లు తెలిపారు. పసిపాపను చంపినట్లు ఆ పనిమనిషికి ఎటువంటి పశ్చాత్తాపం ఏ మాత్రం లేదని తెలిపారు. సలమా కవల పిల్లలలో ఒకరని , తన సహా సోదరి జన్మించిన 12 రోజుల తర్వాత మరణించిందని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కాగా ఈ బార్యాభర్తలకు మరో మూడేళ్ల బాలిక షాహేద్ మాత్రమే ఇపుడు ఉంది. సలమా నెలలు నిండని శిశువుగా జన్మించింది మరియు తక్కువ నిరోధక శక్తితో బాధపడ్డాడు, తల్లిదండ్రులు చెప్పారు. సలమా అనారోగ్యం కారణంగా శ్వాస ఆగిపోయిందని గతంలోనే వైద్యులు తెలిపినట్లు తండ్రి సేలం అల్ మజ్మి తెలిపారు. పోలీసులు ఇప్పటికే పనిమనిషిని అరెస్టు చేశారు. ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు బదిలీ చేయబడింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









