'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి వామ్మో వాయ్యో సాంగ్ జనవరి 2న గ్రాండ్ గా లాంచ్
- December 31, 2025
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి.
తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి వామ్మో వాయ్యో సాంగ్ జనవరి 2న వరంగల్ లో నిర్వహిస్తున్న గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నారు.
సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ మాస్ ఎనర్జీ అదిరిపోయింది. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ లో మాస్ అండ్ స్టైలిష్‌గా డాన్స్ చేస్తూ కనిపించిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్ ని సెట్ చేసింది.
సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఫస్ట్ బీట్ నుంచే పండుగ జోష్‌ను తెరపైకి తీసుకొచ్చింది. రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, స్వాగ్‌తో మెస్మరైజ్ చేశారు. ఆషికా రంగనాథ్, డింపుల్ గ్లామర్‌తో పాటు గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే హుక్ స్టెప్స్, గ్రాండ్ విజువల్స్ తో థియేటర్‌లో అదిరిపోయే వామ్మో వాయ్యో పర్ఫెక్ట్ ఫెస్టివల్ సాంగ్.
ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్.
భర్త మహాశయులకు విజ్ఞప్తి అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ గా ప్రేక్షకుల్ని అలరించబోతుంది.
జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!







