వెనిజులా పై అమెరికా దాడి.. స్పందించిన భారత్
- January 04, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆ దేశ దళాలు.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశంలో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న తాజా వివాదంపై భారత్ మొట్టమొదటిసారిగా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆ ప్రాంతంలో శాంతిని కోరుకుంటున్నట్లు తెలిపింది. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చర్యను బహిరంగంగా ఖండించినప్పటికీ.. భారత్ మాత్రం ప్రధానంగా మన దేశ పౌరుల భద్రత, చర్చల ద్వారా ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలనే అంశాలకే పరిమితమైంది. వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులాలో వేగంగా మారుతున్న పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని.. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది.
సమస్యలను సంబంధిత పక్షాలు అన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ హితవు పలికింది.ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అదే సమయంలో ఆ దేశంలో ఉన్న భారతీయుల భద్రతపైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనిజులాలోని భారతీయ పౌరుల క్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత అని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. వెనిజులాలో ఉన్న 80 మందికి పైగా భారతీయులతో (50 మంది ఎన్‌ఆర్ఐలు, 30 మంది పీఐఓలు) కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు.. భారతీయులకు ప్రయాణ హెచ్చరికలు కూడా విదేశాంగ శాఖ చేసింది. వెనిజులాకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. భారత ప్రభుత్వం తన పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగ ఉండాలని పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్‌లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం







