ఖతార్ లో 80% తగ్గిన స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు..!!
- January 04, 2026
దోహా: ఖతార్ లో స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు 80శాతం తగ్గనున్నాయి. ఇందు కోసం ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్‌ల కోసం అధునాతన లైసెన్సింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ముఖ్యంగా మునుపటి వ్యవస్థతో పోలిస్తే లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులలో దాదాపు 80% తగ్గుతుందని విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్ ఇ లోల్వా బింట్ రషీద్ అల్ ఖాటర్ స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్‌లు ఇప్పుడు ఏటా కాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తమ లైసెన్స్‌లను పునరుద్ధరిస్తాయని తెలిపారు. దీంతోపాటు మంత్రిత్వ శాఖ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విశిష్ట పాఠశాలలకు ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే అధునాతన విద్యా లైసెన్స్ మంజూరు చేయబడుతుందన్నారు.
ఈ వ్యవస్థ ప్రైవేట్ విద్యా సంస్థల లైసెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పనిచేస్తుందని, ఇది అన్ని లైసెన్సింగ్ విధానాలను ఒకే డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







