బ్రెయిన్ డెడ్ బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు అభినందనలు
- January 04, 2026
అమరావతి: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, ఐదుగురికి ప్రాణం పోసిన కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
ర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు.ఈ విషాద సమయంలోనూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకొచ్చి అవయవదానానికి అంగీకరించారు. వారి నిర్ణయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ఈ గొప్ప త్యాగం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదే సమయంలో, తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ వైద్యులను కూడా సీఎం అభినందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







