అబుదాబి కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు, పనిమనిషి మృతి..!!
- January 05, 2026
యూఏఈః అబుదాబిలో శనివారం ఉదయం జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ తోబుట్టువులు మరియు వారి పనిమనిషి మరణించారని యూఏఈకి చెందిన ఒక సామాజిక కార్యకర్త తెలిపారు. అబుదాబి-దుబాయ్ రోడ్డులోని షహామా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన కుటుంబ సభ్యులు రస్ అల్ ఖైమా నివాసితులు. రాజధానిలో జరిగిన సాంస్కృతిక ఉత్సవానికి హాజరైన తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో గాయపడ్డ తండ్రి మరియు తల్లి, వారి 14 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వారు అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని సామాజిక కార్యకర్త చెప్పారు. ప్రమాదం జరిగిన అబుదాబిలోనే వారి మృతదేహాలను ఖననం చేయాలని వారి కుటుంబం తమ్మల్ని సంప్రదించిందని, కానీ దాని కోసం ప్రత్యేక అనుమతి అవసరం అని అన్నారు. యూఏఈలో మరణించిన వ్యక్తిని వారి నివాస వీసా జారీ చేయబడిన ఎమిరేట్లోనే ఖననం చేయాలి. అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







