ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
- January 07, 2026
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. ప్రయాణికులపై భారం మోపేలా ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు.
ప్రత్యేక దృష్టి
అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీ (AP) కి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ పండుగకు గ్రామాలు, పట్టణాలు, నగరాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతాయి. స్థానికులే కాకుండా బతుకుదెరువుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారూ తప్పకుండా స్వగ్రామాలకు వస్తుంటారు. బంధు, మిత్రులతో కలిసి ఘనంగా పండుగను చేసుకుంటారు. పిండి వంటలు, కోడి, ఎడ్ల పందేలతో బోగి, సంక్రాంతి, కనుమ మూడ్రోజులపాటు సందడి చేస్తారు.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్‌కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్‌బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







