ఒమాన్ లో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు..!!
- January 07, 2026
మస్కట్: రాయల్ ఒపెరా హౌస్ మస్కట్‌లో జరిగిన స్టార్టప్ కంపెనీల మీటప్ కార్యక్రమానికి ఒమానీ ప్రామిసింగ్ స్టార్టప్‌ల ప్రోగ్రామ్ (POPS) గౌరవ అధ్యక్షుడు హిస్ హైనెస్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2023 మరియు 2025 మధ్య విజయం సాధించిన స్టార్టప్ కంపెనీల సక్సెస్ విధానాలను ప్రదర్శించారు. సక్సెస్ కంపెనీలను తయారు చేయడంలో ఒమానీ ప్రామిసింగ్ ప్రోగ్రామ్ ద్వారా అందించే ప్రోత్సాహకాల ప్రభావాన్ని తెలియజేశారు.
ఒమానీ స్టార్టప్‌ల సంఖ్య 205 సంస్థలకు చేరుకుందని గణాంకాలు వెల్లడించాయి. వాటి మొత్తం మార్కెట్ విలువ సుమారు USD 395 మిలియన్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ ఆర్థిక రంగాలలో ఒమానీ యువతకు 549 ఉద్యోగ ఆఫర్లను అందించారు. వేడుక సందర్భంగా ఒమానీ ప్రామిసింగ్ స్టార్టప్‌ల కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. విజయం సాధించిన స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు తమ ఆలోచనలను, వాటిని ఆర్థిక విజయాలుగా మార్చడంలో దోహద పడిన అంశాలపై వివరించి ఆకట్టుకున్నారు. అనంతరం సక్సెస్ స్టార్టప్ కంపెనీలకు స్మారక బహుమతులను అందజేశారు.
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







