బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ మెసేజుల హల్చల్..అలెర్ట్ జారీ..!!
- January 09, 2026
మనామాః బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ జరిమానాల మెసేజులు హల్చల్ చేయడంపై జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ స్పందించింది. వైరలవుతున్న మోసపూరిత టెక్స్ట్ మెసేజుల గురించి అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ మెసేజులను అనుమానాస్పద లింక్‌ల ద్వారా వస్తాయని, ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని అడుగుతాయని, చెల్లింపు చేయకపోతే తక్షణ జరిమానాలు విధిస్తామని బెదిరిస్తారని పేర్కొన్నారు.
ఇలాంటి మోసపూరిత మెసేజులకు స్పందించవద్దని సూచించారు. లింకులను క్లిక్ చేయగానే పర్సనల్ డేటా చోరీ అవుతుందని, అనంతరం డబ్బులు కూడా మాయం చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత మెసేజులపై హాట్ లైన్ 992 నెంబర్ లో సమాచారం అందించాలని అవినీతి నిరోధక, ఆర్థిక & ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







