ఆధార్ కార్డు ఉంటేనే జనన,మరణాల ధృవీకరణ పత్రాలు..

- July 28, 2016 , by Maagulf
ఆధార్ కార్డు ఉంటేనే జనన,మరణాల ధృవీకరణ పత్రాలు..

తెలంగాణ రాష్ట్రంలో జనన, మరణాల రిజిస్ట్రేషన్లకు ఇకపై ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల జననాన్ని రిజిస్టరు చేసేందుకు తల్లిదండ్రుల ఆధార్ కార్డుల నెంబర్లు కావాలని ప్రభుత్వం పేర్కొంది. మరణాల నమోదుకు కూడా ఆధార్ కావాల్సిందేనని సర్కారు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఉంటేనే జనన,మరణాల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com