మహేష్ అన్న కొడుకు హీరోగా ఫస్ట్ లుక్ వచ్చేసింది
- January 10, 2026
సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రానికి RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని కథానియికగా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను హీరో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. బైక్ పై వెలుతూ కాస్త వంగి తుపాకీతో కాలుస్తున్నట్లుగా ఉన్న జయకృష్ణ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తుండగా అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







