ఓటీటీలోకి కొత్త సినిమా దండోరా..
- January 10, 2026
నటుడు శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ దండోరా. పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం లాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులను ఓమోస్తరులోనే ఆకట్టుకుంది.
డీసెంట్ కలక్షన్స్ కూడా రాబట్టింది. అయితే, అదే సీజన్ లో మరో మూడు సినిమాలు కూడా విడుదల కావడంతో ఆ పోటీని తట్టుకోవడంలో తడబడింది దండోరా(Dhandoraa OTT) మూవీ. తాజాగా, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దండరా మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిదే.
ఈనేపథ్యంలోనే దండోరా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ చూస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది అమెజాన్ ప్రైమ్. దీంతో, దండోరా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ రాలేదు కాబట్టి, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







