జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!

- January 12, 2026 , by Maagulf
జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!

రియాద్: జెద్దాలోని అల్-రువైస్ పరిసరాల్లోని శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 1,011 భవనాలకు నోటీసులు అందజేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ మొదటి దశలో వీటిని కూల్చివేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

ఆయా భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రక్రియ అమలు ప్రారంభమయ్యే ముందు యజమానులకు చట్టబద్ధంగా తప్పనిసరిగా గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని పేర్కొంది. పట్టణ సుందరీకరణ, జీవన నాణ్యతను పెంచడం మరియు సురక్షితమైన పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com