అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- January 13, 2026
న్యూ ఢిల్లీ: భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమెకు అధికారికంగా ఆహ్వాన లేఖ అందింది. ఇటీవల జరిగిన తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును టైటిల్ విజేతగా నిలిపిన దీపిక ప్రతిభను గుర్తించి రాష్ట్రపతి ఈ ఆహ్వానం పంపారు.
అంధత్వాన్ని జయించి క్రికెట్ శిఖరాలకు దీపిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.
దీపికకు ఒక కన్ను చూపు కోల్పోయిన మనోధైర్యంతో క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తన అద్భుత ప్రతిభతో భారత మహిళా అంధుల జట్టుకు కెప్టెన్ గా ఎదిగారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున ఆడుతూ అనేక విజయాలను అందించారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే నేడు ఆమెను దేశ రాజధానిలో జరిగే అత్యున్నత వేడుకలకు అతిథిగా నిలబెట్టాయి.
రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం పై దీపిక తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ అపురూప గౌరవానికి గాను దీపిక రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







