ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..

- January 16, 2026 , by Maagulf
ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..

ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వం అణ్వాయుధ పరీక్షలు చేయడం వల్లే ఈ భూకంపం వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. డొమినాకు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, బీర్షెబా వంటి నగరాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇది సహజంగా వచ్చిన భూకంపం కాదని ఇజ్రాయెల్ రహస్యంగా నిర్వహించిన అణ్వాయుధా పరీక్షల ఫలితమని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీనిపై కొందరు నిపుణలు పలు కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి సహజ సిద్ధంగా వచ్చే భూకంపాలకు, అణు పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనలకు మధ్య తేడా ఉంటుంది. అణు పరీక్ష జరిగితే ‘సిస్మోగ్రాఫ్’ మీద వచ్చే గ్రాఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ప్రారంభంలోనే భారీ పీక్ పాయింట్‌కి చేరుతుంది. అయినప్పటికీ ఈ ఘటనలో నమోదైన తరంగాలు మాత్రం సాధారణ భూకంప తరంగాలనే పోలి ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com