'ఎల్లమ్మ' తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

- January 16, 2026 , by Maagulf
\'ఎల్లమ్మ\' తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

అద్భుతమైన కథలని ఎన్నుకునే విజనరీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం' ఎల్లమ్మ'ను రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వేణు పవర్ ఫుల్, ఆధ్యాత్మికతతో నిండిన కథని సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లతో దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కెమెరా ముందు అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయడం ఎక్సయిట్మెంట్ ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అరంగేట్రానికి ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ ఆయన ఎనర్జీ, క్రియేటివ్ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ యాప్ట్. ఇందులో హీరోగా నటించడమే కాకుండా చిత్రానికి సంగీతాన్ని కూడా DSPనే అందిస్తున్నారు.


ఎల్లమ్మ సినిమా దైవిక శక్తి నేపథ్యంగా, స్థానిక సంప్రదాయాలు, జానపద విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబించేలా రూపొందుతోంది. మకర సంక్రాంతి శుభ సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా మిస్టికల్ వరల్డ్‌కు అద్బుతంగా పరిచయం చేసింది.

గ్లింప్స్ ఒక స్టన్నింగ్ విజువల్ తో మొదలవుతుంది. సుడిగుండలా తిరుగుతున్న గాలిలో ఓ ఒంటరి వేపాకు పైకి దూసుకెళ్తుంది. దాన్ని గమనిస్తూ ఓ మేక నిలుస్తుంది. క్షణాల్లో వాతావరణం ఉత్కంఠభరితంగా మారుతుంది. కాళ్లకు గజ్జెలు మోగుతూ ఓ వ్యక్తి ఒక వైపు నుంచి పరుగెత్తగా, మరోవైపు నుంచి  షూస్‌ పరిగుపెడుతూ ఇంకొకరు దూసుకొస్తారు. ఆ వేపాకు మేఘాలను దాటి పైకి ఎగసి, క్షణాల్లో అమ్మవారి దివ్య రూపంగా మారుతుంది. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. తడిచిన రెక్కలను విదిలిస్తూ మేక ఒక్కసారిగా కదలడం గ్లింప్స్‌కు మరింత ఎనర్జీ ఇస్తుంది.

తుఫాను నడుమ, చెట్టుకు ఆనించి ఉన్న కొడవలి పక్కన, ఒంటి మీద చొక్కా లేకుండా ఒక వ్యక్తి నడుముకు డోలు కట్టుకొని రాయిపై కూర్చుంటాడు. వెనుక నుంచి తేలుతూ వచ్చిన వేపాకు అతని వెనుక నెమ్మదిగా వాలుతుంది. అతను తిరిగే క్షణంలో… పర్షిగా దేవి శ్రీ ప్రసాద్  కనిపించడం అదిరిపోయింది.

పొడవాటి జుట్టు, రగ్గడ్ లుక్, ఇంటెన్స్ కళ్లతో DSP పాత్రలో పూర్తిగా లీనమై కనిపించారు. వేప, పసుపు, కుంకుమ విజువల్స్ డివైన్ ఆరాను జోడిస్తే, DSP ఇచ్చిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఈ కాన్సెప్ట్ గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఎల్లమ్మ’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

నటీనటులు: దేవి శ్రీ ప్రసాద్
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
రచన, దర్శకత్వం: బలగం ఫేమ్ వేణు యెల్దండి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com