వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!

- January 17, 2026 , by Maagulf
వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!

యూఏఈ: దుబాయ్ పోలీసులు తల్లిదండ్రులు మరియు టీనేజర్లను గట్టిగా హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రాణాంతక ఛాలెంజ్ లు వైరల్ అవుతున్నాయిని, ఇవి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు.  స్కల్ బ్రేకింగ్, ఛోకింగ్, బ్రీత్ హోల్డింగ్, ఇతర తీవ్రమైన గాయాలు లేదా మరణానికి దారితీసే ఛాలెంజ్లు ఈ ట్రెండ్‌లలో ఉన్నాయని అధికారులు ఒక చిన్న వీడియో క్లిప్‌లో తెలిపారు.   

ఇతర దేశాలలో ఇలాంటి ఛాలెంజ్ ల కారణంగా అనేక మందికి తీవ్రమైన గాయాలు కావడంతోపాటు కొందరు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు.  ఏదైనా ప్రమాదకరమైన లేదా అనుచితమైన ప్రవర్తనను గుర్తించిన వెంటనే 901కు కాల్ చేయడం ద్వారా లేదా దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘పోలీస్ ఐ’ సేవ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే, పేరెంట్స్ వారి పిల్లలకు ఈ ఛాలెంజ్ కారణంగా తలెత్తే దుష్ఫ్రభావాలను వివరించాలని కోరారు. ముఖ్యంగా తమ పిల్లలు ఆన్‌లైన్ ను వినియోగించడం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని దుబాయ్ పోలీసులు పిలుపునిచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com