స్కూల్ పిక్నిక్‌లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- January 17, 2026
మస్కట్: 2026 జనవరి 13న రుసేల్ పార్క్‌లో జరిగిన స్కూల్ పిక్నిక్ సమయంలో కొంతమంది విద్యార్థులకు స్టేల్ ప్యాకింగ్ ఫుడ్ ను అందజేసిన సంఘటనపై ఇండియన్ స్కూల్ దర్సైట్ విచారం వ్యక్తం చేసింది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం గురించి పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేసిన స్కూట్ మేనేజ్ మెంట్, ప్రాథమిక దర్యాప్తు జరిపినట్లు తెలిపింది. ఫుడ్ సెల్లవర్ ప్యాకింగ్ ఫుడ్ ను తెల్లవారుజామున తయారు చేసి, ప్యాక్ చేసి, రవాణా చేశాడని వెల్లడించింది. తయారీ, రవాణా సమయంలో జరిగిన లోపాల కారణంగా ఫుడ్ నాణ్యత తగ్గిందని, ఇది భద్రతా పరంగా తీవ్రమైన ఉల్లంఘనగా భావిస్తున్నట్లు తెలియజేసింది. సదరు ఫుడ్ సెల్లర్ ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేశామని స్కూల్ మేనేజ్ మెంట్ తెలియజేసింది. సదరు ఫుడ్ కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







