ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- January 17, 2026
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ నుండి బయలుదేరారని రాయల్ కోర్ట్ ప్రకటించింది.
అంతకుముందు ఆయన ఆస్పత్రిలో అత్యవసరంగా చేరారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై రాయల్ కోర్ట్ స్పందించింది. కింగ్ సల్మాన్ క్షేమంగా ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారని క్లారిటీ ఇచ్చారు.
కింగ్ సల్మాన్ అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత జనవరి 16న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఈ మెడికల్ పరీక్షల్లో ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని రాయల్ కోర్ట్ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







