ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- January 17, 2026
భారత ప్రభుత్వం ఫ్రాన్స్ తో ఒక భారీ రక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ విలువ సుమారు రూ.3.25 లక్షల కోట్లుగా అంచనా. ఇది భారత రక్షణ రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ఒప్పందం కేవలం యుద్ధ విమానాల కొనుగోలుకే పరిమితం కాకుండా, దేశీయ తయారీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చేలా పొందించారు. మొదటి దశలో ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా ఉన్న 18 రాఫెల్ జెట్లను నేరుగా కొనుగోలు చేయనున్నారు. మిగిలిన విమానాలను భారతదేశంలోనే తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ 114 రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి మరింత శక్తిని అందించనున్నాయి. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ జెట్లు గగనతలంలో యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. ఇప్పటికే భారత వైమానిక దళంలో ఉన్న రాఫెల్ జెట్లు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే జెట్లతో ఐఏఎఫ్ బలం మరింత పెరగనుంది. ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశం ‘మేక్ ఇన్ ఇండియా’. ఎక్కువ సంఖ్యలో రాఫెల్ జెట్లు భారతదేశంలోనే తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఫ్రాన్స్ కంపెనీలు భారతీయ సంస్థలతో భాగస్వామ్యం చేయనున్నాయి. కొన్ని కీలక భాగాలు ఇప్పటికే దేశంలో తయారయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ప్రక్రియలో భారతీయ కంపెనీలకు పెద్ద అవకాశాలు లభించనున్నాయి. దీనివల్ల దేశీయ విమాన నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం కూడా దేశంలోకి వస్తుంది. ఈ డీల్ పూర్తయితే భారత్ తన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత సిద్ధంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







