కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!

- January 20, 2026 , by Maagulf
కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) - కువైట్ చాప్టర్ సహకారంతో సల్వా సబా కాన్ఫరెన్స్ సెంటర్ సల్మియాలో ఇండియా–కువైట్ AI ఇంపాక్ట్ డైలాగ్ 2026ను నిర్వహించింది. ఈ సమావేశం 2026 ఫిబ్రవరి 16 నుండి 20 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి సన్నాహాక సదస్సుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కువైట్ నిపుణులు, వివిధ ప్రభుత్వ సంస్థల అధికారులు, బిజినెస్ కమ్యూనిటీ సభ్యులు మరియు టెక్‌ నిపుణులు పాల్గొన్నారు.

ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ పాలన, వ్యాపారం మరియు ప్రొఫెషనల్ సేవలను పునర్నిర్మిస్తోందని ICAI కువైట్ చాప్టర్ అధ్యక్షుడు రోహిత్ అగర్వాల్ అన్నారు. రాబోయే ప్రపంచ AI ఇంపాక్ట్ సమ్మిట్ కు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా కువైట్‌లోని భారత రాయబారి పరమితా త్రిపాఠి పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు ,ప్రతిభలో ప్రపంచ నాయకుడిగా ఉందని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు, తయారీ, క్లీన్ ఎనర్జీ, అంతరిక్ష సాంకేతికత మరియు స్టార్టప్‌లలో భారతదేశం సాధించిన విజయాలను ఆమె హైలైట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com