కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!

- January 20, 2026 , by Maagulf
కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!

సకాకా: అల్-జౌఫ్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ నవాఫ్ సోమవారం కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కొత్త విమానాశ్రయం ఏటా 1.6 మిలియన్ల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 24,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొత్త టెర్మినల్‌లో రెండు ప్రయాణీకుల బోర్డింగ్ బ్రిడ్జిలు, ఏడు డిపార్చర్ గేట్స్ మరియు అంతర్జాతీయ మరియు దేశీయ విమానాల కోసం నాలుగు అరైవల్ గేట్స్ ఉన్నాయి.అలాగే 16 చెక్-ఇన్ కౌంటర్లు ఉండగా, వీటిలో రెండు సెల్ఫ్ సర్వీస్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక ఏడు స్మార్ట్ గేట్లు మరియు ఐదు డ్యూయల్ పాస్‌పోర్ట్ కంట్రోల్ కౌంటర్లతో ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు వేగంగా సేవలను అందిస్తుంది. సౌకర్యవంతమైన లాజిస్టిక్‌లను అందించడానికి వీలుగా ఈ కొత్త విమానాశ్రయంలో 470 మీటర్ల సామాను కన్వేయర్ బెల్టులు మరియు 648 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.ఈ విమానాశ్రయం ప్రస్తుతం మూడు సౌదీ మరియు నాలుగు అంతర్జాతీయ క్యారియర్‌ల ద్వారా సేవలు అందిస్తోంది. రియాద్, జెడ్డా, షార్జా, దుబాయ్, కైరో మరియు అస్సియట్‌లకు కనెక్ట్ అయి ఉంది. ఈ సీజన్‌లో, విమానాశ్రయం మొత్తం విమానాలలో దేశీయ విమానాలు 70 శాతానికి పైగా ఉన్నాయి. వారానికి 38 విమానాలతో రియాద్ అత్యంత ప్రముఖ గమ్యస్థానంగా ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com