ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- January 20, 2026
తిరుమల: ఈ ఏడాది మార్చి చివరి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాల్లో భక్తులకు రోజుకు రెండుసార్లు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ కార్యనిర్వాహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసే దిశగా సన్నాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఇప్పటివరకు కొద్దిపాటి ఆలయాల్లో పరిమితంగా ఉన్న అన్నప్రసాద వితరణను, ఇకపై అన్ని టీటీడీ ఆలయాలకు విస్తరించనున్నారు. దీనివల్ల రోజూ వేలాది మంది భక్తులకు అన్నదానం చేసే అవకాశం ఏర్పడనుంది. ఇదే సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ముందడుగు వేస్తోందని అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గౌహతి, పాట్నా, కోయంబత్తూరు, బెల్గాం నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూములను ఇప్పటికే కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఆలయాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న భక్తులకు కూడా తిరుమల శ్రీవారి దర్శన అనుభూతిని కల్పించాలన్నదే లక్ష్యమని చెప్పారు.
అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు. పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపడతామని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







