బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!

- January 20, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!

మనామా: బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్ కు సంబంధించి ఇద్దరు నిందితులకు విధించిన శిక్షలను ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. అంతకుముందు 35 మరియు 40 సంవత్సరాల వయస్సు గల ఇద్దరికి ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మొదటి నిందితుడికి BHD 102,711 జరిమానా , రెండవ నిందితుడికి BHD 207,044 జరిమానా విధించాడు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేయాలని ఆదేశించింది.

అత్యంత అధునాతన పద్ధతిలో దాచిపెట్టిన నాలుగు లగ్జరీ గడియారాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన క్రమంలో అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు మొత్తం BHD 309,755 విలువైన 182 విలువ ఆధారిత పన్ను (VAT) రీఫండ లావాదేవీలు నిర్వహించారని, వీటిని చట్టవిరుద్ధంగా పొందారని తేలింది. అలాగే నిందితులు బహ్రెయిన్‌లో లగ్జరీ గడియారాలను కొనుగోలు చేసి, వాటిని ఇతర దేశాలలో తిరిగి విక్రయించే ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులు చట్టవిరుద్ధంగా పూర్తి మొత్తంలో వ్యాట్‌ను తిరిగి పొందారని, వారు దానికి అర్హులు కారని పూర్తిగా తెలిసి కూడా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com