గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

- January 20, 2026 , by Maagulf
గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

అమెరికా: గ్రీన్ ల్యాండ్ కు సంబంధించి నార్త్‌ అమెరికా ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్‌(NORAD) ఈరోజు ఒక ప్రకటనను విడుదల చేసింది. గ్రీన్ ల్యాండ్ కు తమ యుద్ధ విమానాలను పంపినట్లు అందులో తెలిపింది. ఆ ద్వీపంలోని పిటుఫిక్ అంతరిక్ష బేస్ లో యుద్ధ విమానం ల్యాండ్ అయిందని చెప్పింది. నార్త్‌ అమెరికా రక్షణ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే లక్ష్యంలో భాగంగా దీన్ని మోహరించనున్నట్లు తెలిపింది. దీని గురించి గ్రీన్ ల్యాండ్ ప్రభుత్వానికి ముందుగానే తెలిపామని..డెన్మార్క్ సమన్వయంతోనే ఈ కార్యకలాపాలు జరిగాయని చెప్పింది. అయితే డానిష్ భూభాగంపై అమెరికా నియంత్రణ కోసం అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ పిలుపునిచ్చిన తర్వాత ఈ చర్య జరగడంతో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి రాజుకున్నాయి. దాంతో పాటూ డెన్మార్క ఈ విషయంపై ఏమీ స్పందించలేదు.

అంతరిక్ష పర్యవేక్షణ మరియు రక్షణకు బాధ్యత వహించే సంయుక్త US-కెనడా సైనిక సంస్థ NORAD తాలూకా ఈ విమానం దాని మూడు ప్రాంతాలు అయిన అలాస్కా, కెనడా, ఖండాంతర యునైటెడ్ స్టేట్స్ మొత్తం అంతా పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. ఉత్తర అమెరికాను రక్షించడంలో ఇటువంటి మోహరింపులు సాధారణమని..యునైటెడ్ స్టేట్స్, కెనడా, డెన్మార్క్ రాజ్యం మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తాయని NORAD కమాండ్ నొక్కి చెప్పింది. ఇక పిటుఫిక్ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి..ఇది తులే ఎయిర్ ఫోర్స్ బేస్ అని పిలువబడే పిటుఫిక్ స్పేస్ బేస్. వాయువ్య గ్రీన్లాండ్‌లో కీలకమైన US సైనిక స్థావరం, క్షిపణి హెచ్చరిక, సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com