ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- January 20, 2026
దోహా: 14వ ఖతార్ హలాల్ ఫెస్టివల్ ఫిబ్రవరి 11 నుండి 16 వరకు కతారా దక్షిణ ప్రాంతంలో జరుగనుంది. ఈ మేరకు కల్చరల్ విలేజ్ ఫౌండేషన్–కతారా ప్రకటించింది. ఖతార్ నలుమూలల నుండి యానిమల్ పెంపకందారులు వస్తారని తెలిపింది. ఈ హలాల్ ఫెస్టివల్ ఫిబ్రవరి 11న ఉదయం గొర్రెల "మజాయెన్" పోటీతో ప్రారంభమవుతుందని ప్రకటించారు.
ఈ ఫెస్టివల్ ఫిబ్రవరి 16న ఉదయం గొర్రెల "మజాయెన్" రౌండ్‌తో ముగుస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా విలువైన గొర్రెలు మరియు మేకల జాతులను, వాటి సంరక్షణ వెనుక ఉన్న నైపుణ్యాన్ని హైలైట్ చేసే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు.
హలాల్ ఫెస్టివల్ ముఖ్యమైన వారసత్వ కార్యక్రమాలలో ఒకటిగా మారిందని, ప్రత్యక్ష పోటీలు, సమాజ భాగస్వామ్యం మరియు సాంప్రదాయ ప్రదర్శనల ద్వారా బెడూయిన్ ఆచారాలను పరిరక్షించడానికి మరియు వాటిని యువ తరాలకు అందించడానికి చేసే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







