వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్

- January 21, 2026 , by Maagulf
వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా (Varanasi Movie) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత ఏడాది హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఈ చిత్రం 2027లో విడుదల అవుతుందని కూడా చెప్పారు. అయితే రాజమౌళి సినిమాలు సాధారణంగా చెప్పిన సమయానికి రిలీజ్ కావు అన్నది ప్రేక్షకులకు తెలిసిందే.

అందుకే చాలామంది ఈ సినిమా నిజంగా 2027లో వస్తుందా? అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మరోసారి స్పందించింది. 2027లోనే ‘వారణాసి’ (Varanasi Movie) రిలీజ్ అవుతుంది అని టీమ్ తాజాగా ట్వీట్ చేసింది. దీంతో మరోసారి స్పష్టత ఇచ్చినట్లయింది. కొందరు అభిమానులు ఈ సినిమాను ఉగాది లేదా శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ రెండు పండుగలకు ఇంకా ఒక సంవత్సరం సమయం మాత్రమే ఉండటంతో, అంతలోనే సినిమా పూర్తి అవుతుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది.మహేష్ బాబు ఇందులో రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను రాజమౌళి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com