ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?

- January 21, 2026 , by Maagulf
ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?

యూఏఈ: భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 91.1825 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. యూఏఈ దిర్హామ్ అమెరికన్ డాలర్‌కు Dh3.67 వద్ద స్థిరంగా ఉంది. భారత రూపాయి యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే 24.8453 వద్ద ట్రేబ్ అవుతోంది.

భారత రూపాయి క్రమంగా బలహీనపడి యూఏఈ దిర్హామ్‌కు రూ.25 మార్కుకు దగ్గరగా వెళుతోంది. ఇది గల్ఫ్ నుండి బలమైన రెమిటెన్స్ ను పెంచుతుందన్న అంచనాలను పెంచుతోంది. ప్రవాస కార్మికులకు మంచి మారకపు రేటు ప్రోత్సాహాన్ని అందిస్తోందని భావిస్తున్నారు.

మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏ నిర్దిష్ట కరెన్సీ స్థాయిని కాపాడబోమని సంకేతాలు ఇవ్వడంతో.. మార్కెట్లలో రూపాయి మరింత క్షీణిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో రూపాయి పతనాన్ని నివారించడం కష్టమని వ్యాపారులు భావిస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com