‘హ్యాపీ రాజ్’ ప్రోమో రిలీజ్..

- January 21, 2026 , by Maagulf
‘హ్యాపీ రాజ్’ ప్రోమో రిలీజ్..

ప్రేమదేశం, రాజా, నరసింహ, శ్వేతనాగు..ఇలా ఎన్నో సూపర్ హిట్ తెలుగు, తమిళ్ సినిమాలతో ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫేమ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులను మెప్పించాడు. 2014 తర్వాత సినిమాలకు దూరం అయి విదేశాల్లో జాబ్ చేసుకుంటూ లైఫ్ గడిపేస్తున్నాడు.

అబ్బాస్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు. తమిళ్ హీరో, సంగీత దర్శకుడు GV ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియా జంటగా తెరకెక్కుతున్న హ్యాపీ రాజ్ సినిమా తెలుగు, తమిళ్ లో రానుంది. కామెడీ లవ్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా హ్యాపీరాజ్ తెలుగు ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అబ్బాస్ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తండ్రిగా నటిస్తున్నాడు.

ఈ హ్యాపీ రాజ్ సినిమా ఒక ప్రేమ జంట, వారి పెళ్లి, మధ్యలో వచ్చే గొడవలతో లవ్ కామెడీ జానర్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ప్రోమో కూడా కామెడీగానే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అబ్బాస్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అబ్బాస్ కామెడీ ఎమోషనల్ పాత్ర అని ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది.

మీరుకూడా అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చిన హ్యాపీ రాజ్ సినిమా ప్రోమో చూసేయండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com