గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!

- January 22, 2026 , by Maagulf
గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!

మనామా: బహ్రెయిన్ లో ఏటా గ్యాస్ లీకేజీల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అనేక మంది గాయపడుతుండగా.. భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి ప్రమాదకర గ్యాస్ లీకేజీ గురించి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారని అన్నారు. 2024లో ముహారక్ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి, యజమాని మరియు ముగ్గురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. మరుసటి సంవత్సరం, ముహారక్‌కు తూర్పున ఉన్న ఆరాద్‌లో ఇలాంటి సంఘటనలో భవనం పూర్తి నేలమట్టమైంది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.

అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అల్ అమాన్ ఓ సోషల్ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ.. హిద్ పోలీస్ స్టేషన్ హెడ్ కల్నల్ డాక్టర్ ఒసామా బహార్ 2024 మరియు 2025లో 300 కి పైగా అగ్నిప్రమాదాలు మరియు 21 పేలుళ్లకు గ్యాస్ లీకేజీలే కారణమని వివరించారు. గ్యాస్ లీకేజీలకు ప్రధాన కారణాలను ఆయన వివరించారు. గ్యాస్ సిలిండర్లను ఏదైనా విద్యుత్ స్విచ్‌లు లేదా ఉపకరణాలకు దూరంగా పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. చిన్న స్పార్క్ కూడా పేలుడుకు కారణమవుతుందని హెచ్చరించారు. గ్యాస్ లీకేజీని గుర్తించినట్లయితే ఏదైనా విద్యుత్ పరికరాలను తాకవద్దని సలహా ఇచ్చారు.  స్టవ్ పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా గ్యాస్ నిలిచే ప్రమాదం తగ్గుతుందని, తద్వారా ప్రమాద తీవ్రత కూడా తగ్గుతుందని వెల్లడిచారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com