అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 23, 2026
కేరళ: రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి – తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది. ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ రైలు నడుస్తుండగా, ఇది రాష్ట్రానికి రెండో రైలు కావడం విశేషం.ఈ ట్రైన్ వీక్లీ ట్రాన్. దీని రెగ్యులర్ సర్వీసు నంబర్ 17041/17042గా ఉంటుంది. మొత్తం 1546 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సుమారు 31 గంటల 30 నిమిషాలు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ సగటు వేగం గంటకు 49 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది.చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది.రైలు నంబర్ 17041 ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువనంతపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17042 ప్రతి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.
నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే:
- నాగర్‌కోయిల్–మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం–తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- తిరువనంతపురం–చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కొత్త రైల్వే సేవలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







