ఓం శాంతి శాంతి శాంతిః ఎంటర్‌టైనింగ్ ట్రైలర్
- January 23, 2026
ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు.A.R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ.
ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. పెళ్లి చూపుల్లో ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) ని ఈశా రెబ్బా 'మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది? అంటూ అడిగే ప్రశ్నతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అలరించింది.
ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ అదరగొట్టేశారు. 'కలకత్తాలలో చేపలని జలపుష్పాలు అంటారు. మీ పుష్పాలు నా చెవిలో పెట్టకండి' అంటూ గోదారి యాసలో తరుణ్ పలికిన డైలాగులు, తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా వున్నాయి.
తరుణ్ భాస్కర్ – ఈశా రెబ్బా మధ్య కెమిస్ట్రీ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్, ముఖ్యంగా ట్రైలర్ చివర్లో తరుణ్ భాస్కర్ రియాక్షన్ క్యురియాసిటీని పెంచుతోంది. కీలక పాత్రలో బ్రహ్మాజీ తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు.
దర్శకుడు ఏ.ఆర్. సజీవ్ ఫన్‌తో పాటు ఎమోషన్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ కథను ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు.
జై క్రిష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌కు లైవ్లీ ఫీల్‌ను తీసుకొచ్చింది. దీపక్ కెమెరా వర్క్ కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా, గోదావరి బ్యాక్‌డ్రాప్ ని న్ని మరింతగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు రిచ్‌గా కనిపిస్తున్నాయి.
కామెడీ, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌తో పాటు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - ఎ ఆర్ సజీవ్
నిర్మాతలు - సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
బ్యానర్- S ఒరిజినల్స్ & మూవీ వెర్స్ స్టూడియోస్
సహ నిర్మాతలు: కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
సంగీతం - జై క్రిష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - దీపక్ యెరగరా
డైలాగ్స్ - నంద కిషోర్ ఈమాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -భువన్ సాలూరు
లైన్ ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు ఈర్ల
PRO - వంశీ-శేఖర్
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







