JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

- January 25, 2026 , by Maagulf
JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల: జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ టీటీడీ నూతన జేఈఓ (విద్య, వైద్య)గా నియమితులైన డాక్టర్ ఏ.శరత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ, బోర్డు సెల్ ఏఈఓ సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ నూతన జేఈఓ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జేఈఓ తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ నూతన జేఈఓను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com