కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!

- January 26, 2026 , by Maagulf
కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!

రియాద్: రియాద్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్.. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ 2ను ప్రారంభించారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, సేవలు, ప్రజా సౌకర్యాలు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినట్లు తెలిపారు.  అనంతరం ఎయిర్ పోర్టులోని లాజిస్టిక్ సేవల డెవలప్ మెంట్ ప్రాజెక్టులను సమీక్షించారు.

కొత్త టెర్మినల్ రాకతో ఎయిర్ పోర్టు సామర్థ్యం రెండితలై.. 14 మిలియన్ల మంది ప్రయాణికులకు చేరిందని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-దువైలెజ్ తెలిపారు.  కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో రియాద్ స్థూల దేశీయోత్పత్తికి 2.2 శాతం దోహదపడిందని, ఇది దాదాపు 66 వేల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను అందించిందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com