టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- January 27, 2026
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగాటోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. కాగా..ఈ టోర్నీ కన్నా ముందు అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.
వార్మప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. వార్మప్ మ్యాచ్‌లకు బెంగళూరులోని సీఓఈ, చెన్నైతో పాటు శ్రీలంకలోని కొలంబోలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత -ఏ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు నమీబియా, యూఎస్ఏలతో ఆడనుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 2న–అఫ్గానిస్తాన్ vs స్కాట్లాండ్ (బెంగళూరు CoE)
ఫిబ్రవరి 2న–అమెరికా vs ఇండియా A (నవీ ముంబై)
ఫిబ్రవరి 2న–కెనడా vs ఇటలీ(చెన్నై)
ఫిబ్రవరి 3న–ఒమన్ vs శ్రీలంక A(కొలంబో)
ఫిబ్రవరి 3న–నెదర్లాండ్స్ vs జింబాబ్వే(కొలంబో)
ఫిబ్రవరి 3న– నేపాల్ vs యుఏఈ (చెన్నై)
ఫిబ్రవరి 4న–స్కాట్లాండ్ vs నమీబియా ( బెంగళూరు CoE)
ఫిబ్రవరి 4న–అఫ్గానిస్తాన్ vs వెస్టిండీస్ (బెంగళూరు CoE)
ఫిబ్రవరి 4న–పాకిస్తాన్ vs ఐర్లాండ్ (కొలంబో)
ఫిబ్రవరి 4న–భారత్ vs దక్షిణాఫ్రికా(నవీ ముంబై)
ఫిబ్రవరి 5న–జింబాబ్వే vs ఒమన్(కొలంబో)
ఫిబ్రవరి 5న–నేపాల్ vs కెనడా (చెన్నై)
ఫిబ్రవరి 5న–ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్(కొలంబో)
ఫిబ్రవరి 5–న్యూజిలాండ్ vs అమెరికా(నవీ ముంబై)
ఫిబ్రవరి 6న–ఇటలీ vs యుఏఈ–(చెన్నై)
ఫిబ్రవరి 6న–నమీబియా vs ఇండియా A (బెంగళూరు CoE)
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







