ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి

- January 27, 2026 , by Maagulf
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి

మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్, నేర ముఠాల ఆధిపత్య పోరు మరోసారి రక్తపాతానికి దారితీసింది. ఆదివారం (జనవరి 25, 2026) సాయంత్రం సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సండే వినోదంగా కోసం వచ్చిన పౌరులపై గన్‌మెన్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. సలమాంకా సిటీలోని లోమా డి ఫ్లోర్స్ ఏరియాలో ఒక కమ్యూనిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత ఈ ఘోరం జరిగింది. మ్యాచ్ ముగిసి అందరూ బయటకు వస్తున్న సమయంలో గన్స్‌తో వచ్చిన కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నారు.

దుండగులు వాహనాల్లో వచ్చి ఒక్కసారిగా గుంపుపై తూటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో ఒక మహిళ, ఓ బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అమానుష ఘటనపై సలమాంకా మేయర్ సీజర్ ప్రియెటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని “పిరికిపంద చర్య”గా అభివర్ణించిన ఆయన, స్థానిక అధికారులను లొంగదీసుకోవడానికి నేర ముఠాలు చేస్తున్న ప్రయత్నమని అన్నారు. గ్వానాజువాటో రాష్ట్రం ప్రస్తుతం సాంటా రోసా డి లిమా గ్యాంగ్, జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ మధ్య జరుగుతున్న భీకర పోరుకు నిలయంగా మారింది. చమురు దొంగతనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పట్టు కోసం ఈ ముఠాలు తరచూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దారుణ ఉదంతం తర్వాత మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ సహాయం కోరుతూ మేయర్ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com