ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- January 27, 2026
మస్కట్: ఒమన్ లో సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ (SPF).. పని ప్రాంతంలో గాయపడ్డ కార్మికులు, లేదా వ్యాధుల బారిన పడితే అందే ప్రయోజనాలకు సంబంధించి నిబంధలను ప్రకటించింది. సామాజిక బీమా వ్యవస్థలో ఒక భాగం కార్మికులకు బీమా రక్షణను అందజేస్తుందని తెలిపింది.
సామాజిక రక్షణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా.. యజమానులు పని ప్రాంతాల్లో గాయపడ్డ మరియు వృత్తిపరమైన వ్యాధుల బీమా విభాగం కోసం బీమా చేసిన ఉద్యోగి వేతనంలో 1% మొత్తాన్ని నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. వృత్తిపరమైన వ్యాధుల ఫలితంగా ఏర్పడే వ్యాధులకు పరిహార చెల్లింపులు, వైకల్యం మరియు మరణ పెన్షన్లతో సహా సమగ్ర బీమా రక్షణను అందిస్తుందని సోషల్ ప్రొటెక్షన్ ఫండ్‌లోని వైద్య వ్యవహారాల డైరెక్టర్ షమ్సా బింట్ హమ్దాన్ అల్ తమ్మిమి తెలిపారు.
బీమా శాఖ కింద అందిస్తున్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను వివరించారు. గాయపడ్డ తర్వాత మొదటి ఆరు నెలల్లో బీమా చేయబడిన వేతనంలో 100% చెల్లించే రోజువారీ ప్రయోజనంతోపాటు ఆ తర్వాత కూడా పనికి వెళ్లలేని వారికి 75% వేతనం ఆరు నెలలకు పైగా కొనసాగుతుంది. ఇక వైకల్యం రేటు 30% కంటే తక్కువగా ఉంటే, బీమా చేయబడిన వ్యక్తి ఏకమొత్తం పరిహారం పొందే అర్హత ఉంటుంది. వైకల్యం 30%కి చేరుకుంటే కానీ మొత్తం వైకల్యానికి సమానం కాకపోతే, బీమా చేయబడిన వ్యక్తి నెలవారీగా చెల్లించాల్సిన శాశ్వత పాక్షిక వైకల్య పెన్షన్‌కు అర్హులు అవుతారు. మొత్తం వైకల్యం ఉన్న సందర్భాల్లో, సగటు వేతనంలో 75% నెలవారీ పెన్షన్ మంజూరు చేయబడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







