ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- January 27, 2026
యూఏఈ: భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులందరికీ సౌదీ అరేబియాలోని భారత రాయబారి ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ -సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జెడ్డా పర్యటన, ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచిందని తెలిపారు. ప్రాంతీయ స్థాయిలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ భాగస్వామ్యాన్ని స్పష్టమైన ఫలితాలుగా అనువదించడానికి చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.
జెడ్డా నగరంలో భారత నావికాదళ నౌకలు INS సూరత్ మరియు INS తమల్ లు స్నేహం, సహకారం మరియు మన రెండు దేశాల మధ్య పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. సాంస్కృతిక డిప్లోమసీ ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తుందని తెలిపారు. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ పాల్గొనడం, వివిధ ప్రావిన్సులలో ఇండియా ఫెస్టివల్ వేడుకలు, మరియు నూర్-ఎ-దీపావళి మరియు ఆర్గానిక్ ఇఫ్తార్ వంటి కమ్యూనిటీ నేతృత్వంలోని సాంస్కృతిక కార్యక్రమాలు లోతైన సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి దోహదపడ్డాయని వివరించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







