ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- January 27, 2026
దోహా: దోహాలో సంస్థ కొత్త కార్యాలయం ప్రారంభం.. ప్రపంచ బ్యాంకు -ఖతార్ మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. దీని ద్వారా పెట్టుబడులను సమీకరించడం, యువతకు మద్దతు ఇవ్వడం మరియు మిడిలీస్టు, ఉత్తర ఆఫ్రికా అంతటా అభివృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.
ఖతార్ - ప్రపంచ బ్యాంకు గ్రూప్ మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించిన ఆర్థిక మంత్రి హెచ్ ఇ అలీ బిన్ అహ్మద్ అల్-కువారీ పై ఆయన ప్రశంసలు కురిపించారు. దోహా కార్యాలయం ప్రారంభం ఖతార్ తో పటిష్టమైన పునాదిని మరియు అభివృద్ధికి ఆర్థిక సహాయం, ప్రైవేట్ రంగంలో సహకారాన్ని విస్తరించాలనే ఉమ్మడి ఆశయాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఇది కేవలం ప్రపంచ బ్యాంకు సిబ్బందికి మాత్రమే కాకుండా, యువ ఖతారీ నిపుణులను అభివృద్ధి చేయడానికి ఒక వేదికగా కూడా ఉపయోగపడుతుందని అజయ్ బంగా వివరించారు. ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ రంగం నుండి ప్రతిభావంతులను ప్రపంచ బ్యాంకుకు డిప్యుటేషన్‌పై పంపి, వారికి అంతర్జాతీయ అనుభవాన్ని అందించి, జాతీయ మరియు ప్రాంతీయ అభివృద్ధి ప్రయత్నాలకు దోహదపడేలా ప్రపంచ ఉత్తమ పద్ధతులతో తిరిగి వచ్చేలా చేస్తామని ఆయన తెలిపారు.
రాబోయే 12 నుండి 15 సంవత్సరాలలో మిడిలీస్టు, ఉత్తర ఆఫ్రికాలో లక్షలాది మంది యువకులు ఉపాధిని లేదా వారి స్వంత వ్యాపారాలను ప్రారంభించి కార్మిక మార్కెట్‌లోకి ప్రవేశిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వ్యాపార ప్రధాన్యతా రంగాలను వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు చెందిన కంపెనీలు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని.. రెండో స్థానంలో వ్యవసాయ సంబంధిత రంగాలు..టూరిజం సెక్టర్ రాబోయే రోజుల్లో ఉపాధిని కల్పించడంలో కీలకంగా మారతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







