కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!

- January 28, 2026 , by Maagulf
కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!

కువైట్: కువైట్ లో ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని  స్కామ్ టెక్స్ట్ మెసేజులపై జాగ్రత్తగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరించారు. వెంటనే జరిమానాలు చెల్లించకపోతే జరిమానాలు KD 20 నుండి KD 200 వరకు పెరుగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు డబ్బు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, ఇలాంటి ఫేక్  లింక్‌లను క్లిక్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ SMS లను పంపదని క్లారిటీ ఇచ్చారు. అన్ని విచారణలు మరియు చెల్లింపులు ప్రభుత్వ సాహిల్ అప్లికేషన్ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజులు వస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com