ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- January 28, 2026
మనామా: ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు సేవలు అందించేలా పునరుద్ధరణ చేయాలనే ప్రతిపాదనను బహ్రెయిన్ ప్రతినిధుల మండలి మెజారిటీ ఓటుతో ఆమోదించింది. ప్రతిపాదికను పరిశీలించి సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను ఎంపీలు హమద్ అల్ డోయ్, అబ్దుల్వాహిద్ ఖరాటా, బాదర్ అల్ తమిమి, హిషామ్ అల్ అవధి మరియు డాక్టర్ హిషామ్ అల్ అషీరి సమర్పించారు. కేంద్రంలో పని గంటల తగ్గింపు తర్వాత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపై ఒత్తిడి పెరిగిందని వారు పేర్కొన్నారు.
మరోవైపు, కింగ్ హమద్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో వేచి ఉండే సమయం సగటున రెండు నుండి మూడు గంటల నుండి ఐదు నుండి ఏడు గంటల వరకు పెరిగిందని తెలిపారు. బు మహర్లోని అల్ హలా ఆరోగ్య కేంద్రం పనిచేస్తున్నప్పటికీ, ఉత్తర ముహర్రక్ నివాసితులకు, ముఖ్యంగా వృద్ధ రోగులు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొటున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







