కాశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ
- July 29, 2016
కాశ్మీర్ అల్లర్ల వెనుక భారత్ చేస్తున్న వాదనే నిజమైంది. అదే నిజమంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ కూడా ధ్రువీకరించాడు! ఈ సంచలన ప్రకటన ద్వారా ఏకంగా నవాజ్ షరీఫ్‌ను ఇరకాటంలో పడేశాడు. కాశ్మీర్ అల్లర్లు లష్కరే తోయిబా సృష్టించినవేనని గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఉద్యమాలు దాని పనేనని హఫీజ్ సరుూద్ చెప్పడం ఇప్పుడు నవాజ్ సర్కార్‌ను దిక్కుతోచని స్థితిలో పడేసింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ భారత భద్రతా దళాల దాడిలో మరణించిన నేపథ్యంలో కాశ్మీర్లో జరిగిన ఉద్యమాలకు లష్కరే తోయిబా మిలిటెంటే సారథ్యం వహించాడని హఫీజ్ సరుూద్‌ను ఉటంకిస్తూ ఇండియా టుడే పత్రిక వెల్లడించింది. 'లక్షలాదిగా కాశ్మీరీలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయడం మీరు చూశారా? ఆ జనం తమ భుజాలపై ఎవరిని ఎత్తుకుమోశారో చూశారా? అతడే ఆ ప్రదర్శనకు నాయకుడని మీకు తెలుసా? ఆ వ్యక్తే 'అమీర్'. లష్కరే తోయిబా మిలిటెంట్' అని సరుూద్ పేర్కొన్నాడు. ఈ ఘటనతో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలకెక్కించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కుట్రపూరితమేనని స్పష్టమైంది. అన్నింటికీ మించి కాశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ మిలిటెంట్ల హస్తం మరింత స్పష్టంగా హఫీజ్ ప్రకటనతో తేటతెల్లమైంది. కాశ్మీర్ లేకుండా పాకిస్తాన్ పరిపూర్ణం కాదని, ఏదో ఒకరోజు ఇది పాక్‌లో కలుస్తుందన్న నవాజ్ షరీఫ్ మాటల్ని సరుూద్ పునరుద్ఘాటించాడు. వనీ ఉన్నట్లు భద్రతా దళాలకూ తెలియదు: మెహబూబా శ్రీనగర్: ఈ నెల 8న ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వన్నీ ఉన్నాడనే విషయం భద్రతా దళాలకు కూడా తెలియదని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇంటిలోపల ముగ్గురు మిలిటెంట్లు ఉన్నారని మాత్రమే తమకు తెలుసునని, అయితే వాళ్లు ఎవరనేది తెలియదని, పోలీసులు, సైన్యం తనకు చెప్పారని గురువారం మెహబూబా చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







