ఐసీఐసీఐ బ్యాంకు తొలి త్రైమాసిక ఫలితాల్లో దాదాపు 25శాతం క్షీణత

- July 29, 2016 , by Maagulf
ఐసీఐసీఐ బ్యాంకు తొలి త్రైమాసిక ఫలితాల్లో దాదాపు 25శాతం క్షీణత

అతి పెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ తొలి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. జూన్‌ 30 నాటికి ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభం 22.1శాతం తగ్గి రూ.2,516 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికానికి రూ.3,232 కోట్ల నికరలాభంతో ఉంది.
* స్టాండలోన్‌ పద్ధతిలో ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభం 25శాతం తగ్గి రూ.2,232 కోట్లు ఆర్జించగా, గతేడాది ఈ మొత్తం రూ.2,976 కోట్లుగా ఉంది. . * గతేడాదితో పోలిస్తే నిరర్థక ఆస్తుల శాతం 3.68 నుంచి 5.87శాతానికి పెరిగింది. * నికర నిరర్థక ఆస్తుల విలువ గత తొలి త్రైమాసికానికి 1.58శాతం ఉండగా అది ఇప్పుడు 3.35శాతానికి చేరింది. * స్థూల నికర నిరర్థక ఆస్తులు రూ.15,138 కోట్ల నుంచి రూ.27,194 కోట్లకు పెరిగాయి. * మొత్తం ఆదాయంలో వృద్ధి నమోదైంది. గతేడాది రూ.15,802 కోట్లు ఉండగా, ఈ సారి రూ.16.760 కోట్లకు పెరిగింది. * ఇక నికర వడ్డీయేతర ఆదాయం రూ.5,159 కోట్లు కాగా కిందటి తొలి త్రైమాసికంలో ఇది రూ.5,115 కోట్లుగా ఉంది. * శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3.40శాతం తగ్గి రూ.262.85 వద్ద ముగిశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com