ఒకే కాన్పులో 11 మంది పిల్లలకి జన్మనిచ్చిన తల్లి

- July 29, 2016 , by Maagulf
ఒకే కాన్పులో 11 మంది పిల్లలకి జన్మనిచ్చిన తల్లి

సాధారణంగా ఒకే కాన్పులు కవలలు కనడం చూశాం..లేదా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు కనడం చాలా అరుదుగా ఐదుగురు పిల్లలను కనడం వింటున్నాం. కానీ ఒక మహిళకు ఒకే కాన్పులో ఏకంగా 11 మంది సంతానం కలగడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దాదాపు ఒక లెక్కలో చెప్పాలంటే ఒకే కాన్పులో ఆ మహిళ ఏకంగా క్రికెట్ టీమ్ నే కనేసింది. సాధారణంగా మాతృత్వం కోసం పరితపించే మహిళలు ఒక భార్యగా తల్లిగా జీవితం ధన్యమైందనుకుంటుంది.
కానీ కొంత మంది మహిళలకు దురదృష్ట వశాత్తు సంతానం కలగకపోవడం హృదయాన్ని కలిచి వేస్తుంది. ఇక ఇలాంటి మహిళలను కొంత మంది గొడ్రాలు అని పిలవడం ఆమె పడే ఆవేదన అంతా ఇంతా కాదు. వివాహ అనంతరం ప్రతి మహిళ తాను తల్లి కావాలని అనుకుంటుంది..కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల అది జరగకపోతే ఆమె పడే భాదలకు అతే ఉండదు.
ఇక వేళ తాను తల్లి అయినప్పుడు పొందే ఆనందానికి అవధులుండవు. పిల్లలు లేని స్త్రీలు సంతానం కలగాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుతారు. పెద్దలు చెప్పినట్లు ఉపవాసాలు, దీక్షలు చేస్తారు. అయినా కొంతమంది మహిళలు పిల్లలు పుట్టక బాధ పడుతుంటారు.
ప్రసవానికి వచ్చి ఆ మహిళను చూసి అందరూ ఆశ్చర్యపోయారు అయితే నలుగురు పిల్లలు ఉండొచ్చు అనుకున్న వైదుల్యలు దాదాపు 20 మంది వైద్యులు ఆ మహిళకు ఆపరేషన్ చేసి 11 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. పిల్లలందరినీ ఒకే మంచంపై పడుకోబెట్టారు. ప్రస్తుతం తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com